11, మే 2014, ఆదివారం

సంవర్గ మానాలు

సంవర్గ మానాలను గూర్చి తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రశ్న వేసుకొందాం
2 ను ఎన్ని సార్లు గుణిస్తే 8 వస్తుంది? 3 సార్లు. దీన్ని ఘాతాంక(exponent) రూపంలో వ్రాస్తే 23=8
ఇందులో 2 ను భూమి(base) అని అంటారని మనకి తెలుసు. ఇపుడు 3 ను 2 భూమికి 8 యొక్క సంవర్గమానం అంటాము. దీన్ని logarithm అని చదువుతాము Log  అనే సంకేతంతో సూచిస్తాము.
log2(8) = 3


ఇదే విధంగా
3ను ఎన్ని సార్లు గుణిస్తే 81  వస్తుంది? 4 సార్లు.  దీన్ని ఘాతాంక రూపంలో వ్రాస్తే 34=81
ఇందులో 3  భూమి. ఇపుడు 4  ను 3  భూమికి 81  యొక్క సంవర్గమానం అంటాము. దీనిని వ్రాయాలంటే
  అని వ్రాస్తాము.
log3(81) = 4


10 ని ఎన్ని సార్లు గుణిస్తే 100000  అవుతుంది ? 5 సార్లు.  దీన్ని ఘాతాంక రూపంలో వ్రాస్తే 105=100000
ఇందులో 10   భూమి. ఇపుడు 5   ను 10   భూమికి 100000 యొక్క సంవర్గమానం అంటాము. దీనిని వ్రాయాలంటే
log10(100000) = 5

  అని వ్రాస్తాము.

6, ఏప్రిల్ 2014, ఆదివారం

అంక గణిత ప్రాథమిక సిద్దాంతము

అంక గణిత ప్రాథమిక సిధ్ధాంతం ప్రకారం 1 కంటే పెద్దదైన ప్రతి పూర్ణ సంఖ్య ఒక ప్రధాన సంఖ్య కాని, ప్రధాన సంఖ్యల లబ్ధం గాని అయి ఉంటుంది.
దీని ప్రకారం ప్రధాన సంఖ్యలు సంఖ్యావ్యవస్థకు ఇటుకలలాంటివి . అంటే ఏ సంయుక్త సంఖ్య నయినా ప్రధాన సంఖ్య ల లబ్ధంగా వ్రాయవచ్చు.


క్రింది ఉదాహరణను గమనించండి 4 అనే సంయుక్త సంఖ్యను 2x2 గా వ్రాసాము.6 ను 2x3గా, 8 ని 2x2x2గా వ్రాయగలము. ఇక్కడ గమనించాలసిందేమిటంటే 4, 6, 8 లను ప్రధాన సంఖ్యల లభ్దంగా రాయచ్చు.
163800 ను 2x2x2x3x3x5x5x7x13 గా రాయవచ్చు.  
163800=2X 32X 52X7X13

ఇక అఁక గణిత ప్రాథమిక సిధ్దాంతాన్ని క్రింది విధంగా నిర్వచిస్తాము
నిర్వచనం: ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధానాంకాల లబ్ధంగా రాయవచ్చు. మరియు ప్రధానాంకాల క్రమం ఏమైనప్పటికీ ఈ కారణాంకాల లబ్ధం ఏకైకము.

ను ఒక  సంయుక్త సంఖ్య గా తీసు కోండి. దీనిని మనం సాధారణంగా x =p1,p2,p3………..గావ్రాయ వచ్చు. ఇందులోp1,p2,p3 లను ఆరోహణ క్రమంలో ఘాతాల రూపంలో  వ్రాసామనుకోండి. ఆ లబ్ధం ఏకైకమవుతుంది. అంటే పై ఉదాహరణలో 163800 ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఎలా  వ్రాసినప్పటికి చివరికి వాటిని  ప్రధానకారణాంకాలుగా వ్రాసి, ఆరోహణ క్రమంలో ఘాతాల రూపంలో వ్రాయ గలిగే విధానం ఒక్కటే.

కసాగు : 


రెండు కాని అంతకంటే ఎక్కువ సంఖ్యలకు అతిచిన్న గుణిజాన్ని  ఆ సంఖ్యలకు కనిష్ట సామాన్య గుణిజము  అంటాము. 

3
,5 లకు గుణిజాలు 
3 గుణిజాలు : 3,6,9.12,1518,21,24,27,30,. . . . . .
5 గుణిజాలు: 5,1015202530,.... 

పై రెండు సంఖ్య లకు గుణిజాలలో రెంటికి చెందిన గుణిజాలు గుర్తిస్తే 15
30 వస్తాయి. (సామాన్య గుణిజాలు)


ఇందులో చిన్న సామాన్య గుణిజమేది
 ? 15 కనుక 15 ను3,5 ల కనిష్ట సామాన్య గుణిజం అంటాము. ఆంగ్లంలో LCM అని అంటారు.  క్రింద ఇంకా వివరంగా పట రూపంలో చూపడం జరిగింది.
multiples
గసాకా:
రెండు కాని అంతకంటే ఎక్కువ సంఖ్యలను కారణాంకాలుగా విభ జించినప్పుడు ఆ సంఖ్యలకు ఉన్న ఉమ్మడి కారణాంకాలలో అతి పెద్ద కారణాంకం ను గసాకా అంటారు.

15, 30 ,  105 
ల కారణాంకాలను పరిశీలిద్దాం.
15 కారణాంకాలు 13,5మరియు15
30  కారణాంకాలు 1, 2, 3, 5, 6, 10, 15 మరియు 30
105  కారణాంకాలు 1, 3, 5, 7, 15, 21, 35 మరియు  105
15, 30105 ల కు సామాన్య కారణాంకాలు  1, 3, 5 and 15

ఇందులో అతిపెద్దది 15

కనుక 15 ను గరిష్ట సామాన్య కారణాంకం అంటాము.


కసాగు, గసాకా ల మధ్య సంబంధం:
a మరియు  b లు రెండు ధన పూర్ణ సంఖ్యలు అయునచో వాటి గసాకా X కసాగు = a.b అవుతుంది. 

క్రింద ఖాన్ అకాడమీ వారు
  ప్రధాన సంఖ్యలు పైన తెలుపుకున్న అంక గణిత ప్రాథమిక సిధ్ధాంతం పై వీడియోనుంచారు. దయ చేసి చూడండి.

 https://www.youtube.com/watch?v=8CluknrLeys
Prime Numbers Up To 100

5, ఏప్రిల్ 2014, శనివారం

పదవ తరగతి గణితం - వాస్తవ సంఖ్యలు

పరిచయం:

కరణీయ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు కలసి ఉన్న సమూహాన్ని వాస్తవ సంఖ్యలు అంటారు.
వాస్తవ సంఖ్య ల సమితి క్రింద చూపిన విధంగా ఉంటుంది.

మరి అకరణీయ సంఖ్యలు అంటే ఏమిటి?

అకరణీయసంఖ్యలు 

అకరణీయ సంఖ్యలను p/q రూపంలో వ్రాయగలిగే సంఖ్యలు ఇందు p ,q లు పూర్ణ సంఖ్యలు
q≠0
ఇవి పూర్ణ సంఖ్య ల సమూహం కన్నా పెద్దది.
అన్ని అకరణీయ సంఖ్యలను అంతమయ్యే దశాంశాలు లేదా అంతం కాని దశాంశాలు గా వ్రాయవచ్చు.
ఉదాహరణ కి 1,2,3 లు అకరణీయ సంఖ్యలు వీనిని 2/1, 3/1, 4/1 రూపంలో వ్రాయగలం.
అలాగే 6.25, 6.45 లను 625/100, 645/100 (p/q)  రూపంలో వ్రాయ గలం.
ఆవర్తన దశాంశాలయిన ఈ క్రింది సంఖ్యలను కూడా p/q రూపంలో వ్రాయ గలం. కనుక ఇవి అకరణీయ సంఖ్యలు.
3.3333333....  , 7.127127127........... ,
Example:
1.5 ఒక అకరణీయ సంఖ్య ఎందుచేత ?
 1.5 = 3/2 (1.5 ని భిన్న రూపంలో వ్రాయగలిగాం )

ఇంకా కొన్ని ఉదాహరణలు
సంఖ్య  p/q రూపంలో అకరణీయ సంఖ్య ?
5 5/1 అవును 
1.75 7/4 అవును
.001 1/1000 అవును
0.111... 1/9 అవును
√2
(square root of 2 రెండు యొక్క వర్గ మూలం)
? కాదు  !
చివరి సంఖ్య ను మనం  p/q రూపంలో రాయలేక పోతున్నాం ఇలాంటి సంఖ్యలు మన సంఖ్యా వ్యవస్థ లో ఇంకా ఉన్నాయి, అలాంటి సంఖ్యలను కరణీయ సంఖ్యలు అంటాము. ఉదాహరణకి, √5,√7,√6  
ఇంకా ఈ జాబితాలోకి వచ్చే సంఖ్యలు మరి కొన్ని Pi (π).
Pi (π) = వృత్త పరిధి / వ్యాసము  అని మనకి తెలుసు.

Rational Number


Pi (π) =వృత్త పరిధి / వ్యాసము


కరణీయసంఖ్యలు 

మరి ఈ కరణీయ సంఖ్యలు అంటే ఏమిటో చూద్దాం:
ఏ సంఖ్యలను p/q రూపంలో రాయలేక పోతున్నామో ఆ సంఖ్యలను కరణీయ సంఖ్యలు అంటారు. 
Examples:

ఉదాహరణ   √5,√7,√6  
ఇంకా ఈ జాబితాలోకి వచ్చే సంఖ్యలు మరి కొన్ని Pi (π), e (Euler's Number), Golden Ratio,
Pi (π)A diagram of a circle, with the width labeled as diameter, and the perimeter labeled as circumference
π = 3.1415926535897932384626433832795 (ఇంకా....... )
Pi. విలువను మనం భిన్న రూపంలో వ్రాయలేము 
 Pi.=22/7 = 3.1428571428571... అని మనం తీసుకొనే విలువ కొంత దగ్గరి విలువ అది ఖచ్చితం కాదు.

కొన్ని గుర్తుంచుకోవలసిన కరణీయ సంఖ్యలు : 

Pi Pi విలువ ఒక కరణీయ సంఖ్య దీని విలువ లో ఆవర్తన దశాంశాలు ఇప్పటి వరకు కనుగొనబడలేదు.
3.1415926535897932384626433832795 (and more ...)
e e (Euler's Number) అనేది ఒక కరణీయ సంఖ్య దీని విలువ లో ఆవర్తన దశాంశాలు ఇప్పటి వరకు కనుగొనబడలేదు.
e = 2.7182818284590452353602874713527 (and more ...)
phi Golden Ratio అనేది ఒక కరణీయ సంఖ్య దీని విలువ= 1.61803398874989484820... (and more ...)
radical symbol అనేక సంఖ్యల వర్గ మూలాలు, ఘన మూలాలు, మూలాలు కరణీయ సంఖ్యలవుతాయి :
√3 1.7320508075688772935274463415059 (etc)
√99 9.9498743710661995473447982100121 (etc)
కాని అన్ని సంఖ్యల మూలాలు కరణీయ సంఖ్యలు కావు. ఖచ్చిత మూలం లేనివి మాత్రమే కరణీయ సంఖ్యలు
ఉదాహరణకి √4 = 2 ( అకరణీయ సంఖ్య), మరియు  √9 = 3 ( అకరణీయ సంఖ్య) ...

 కరణీయ సంఖ్యల గురించి ఒక చిన్న విషయం: 

క్రింద చూడండి :
  • π × π = π2 కరణీయ సంఖ్య
  • But √2 × √2 = 2 కరణీయ సంఖ్య కాదు 
కనుక కరణీయ సంఖ్య ల లబ్ధం కరణీయ సంఖ్య యే అవాల్సిన పనిలేదు.

వాస్తవ సంఖ్యలను సంఖ్యా రేఖ పై చూపడం:

అకరణీయ సంఖ్యలను సంఖ్య లను సంఖ్యా రేఖ పై చూపగలం:


మరి కరణీయ సంఖ్య లను చూపగలమా ?